రావణుఁడు దశగ్రీవుఁడేనా?
శిల్పు లాకాశ పట్టణంబులఁ గూడ నిర్మించిరి. 'సౌంభకము
నిదర్శనము, ఆర్యకవులు కూడ ననఁగా మునులు కూడఁ
గొంతవఱకు రాముని నిజతత్వ మెఱుంగుదురు. ఎరింగియే
శ్రీరాముని మాయామానుషవిగ్రహుడనిరి. అనఁగా తెలివి
'తేటలు లేని మానవుఁడని యర్థము. 'రాముఁడు మునులనుండి
పంచాంగము వినువాఁడో కాని యొరులకుఁ బంచాంగము
గఱపజాలినవాడు కాడు,
రావణుఁడు దశగ్రీవుఁడేనా ?
రావణునకుఁ బదికంఠము లున్న వాయను సంశయం
బును బెక్కు రు వాదోపవాదములుగాఁ జర్చించి యున్నారు.
కొందతీది యసంభవమనియు, నై జవిరుద్ధమనియుఁ జెప్పు
చున్నారు. కాని యీప్రవాదమేల బయలు వెడలినదో చెప్పఁ
జాలకున్నారు. ఇటీవలి కూలంకష పరిశోధనచే రావణుఁడు
కోయదొరయనియు, లంజావానులు కోయలనియుఁ దేలినది.
రావణుని మాతృభాష యగు కోయభాషఁ బరిశీలించిన యెడల
సంస్కృత శబ్దములని భ్రమపడుచున్న కొన్ని' శబ్దములకు,
సంస్కృతమున సరియైన యగముఁ జెప్పఁజూలని కొన్ని
శబ్దములకుఁ జక్కని యర్థములు స్పష్టపడుచున్నవి. అట్టి శబ్ద
ములఁ గొన్నింటి నిట వివరించెదము.
27