పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/245

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాముఁడు


బోయెను. మేనమామ యింటినుండి పితృమరణవార్త విని భరతుండు సా కేతంబునకు వచ్చి, తల్లివలన సర్వోదంతం బెఱింగి, యచట నిలువ నొల్లక, చిత్రకూటంబుననున్న శ్రీరాముని కడకు వచ్చి సా కేతంబునకుఁ దిరిగివచ్చి, పట్టాభి షేకంబుఁ జేసికొమ్మని నొక్కి నొక్కి వేడెను. శ్రీరాముండు కారణాంత రములచే సమ్మతి లేనివాఁడై , "రాజ్యంబు తన చేతినుండిజారి పోకుండ నుంప నిశ్చయించిన పాఁడై , నెఠభరతునకు నచ్చఁ చెప్పి, తనకుఁ బతిగాఁ దన పొదు కాద్యయము వానికి నిచ్చి పంపెను. శ్రీరాముని యీ కార్యముచే భరతుఁడు సాకేత సింహాసన మెక్క లేదు; తానొంటిగా సరణ్యమునకుఁ బోయి యుండ లేదు. దశరథుడు కైకకు నిచ్చిన రెండువరము లీవిధ ముగా శ్రీరాముఁడు తీర్చెను. శ్రీరాముఁడు పితృవాక్యపరిపాలన మిషచే ద్రావిడలోకంబును జయించి, రాజ్య విస్తృతిఁ జేసి కొనుటకు దక్షిణాపథమునకు వచ్చెను గాని వేరొడు కాదు.


నిష్కారణముగ మునులయెదుట రాక్షసవధ చేసెద సని శపథములు పల్కిన రామునిఁజూచి, సీత భయపడి యేల యిట్టి శపథమును జేసితిరని శ్రీరాముని బ్రశ్నింప సీతతో, నిట్లు చెప్పెను: * “ [1]యేను గై 'కేమోయీ వరు వనంబున వ్యాజంబున సకుఁ జనుదెంచితిని",




24

  1. గోపీనాధ రామాయణము, మొదటి సంపుటము 40 వ పేజి.'