దక్షిణాపథము
తెలుఁగునం బ్రవేశించి కొంతవరకు వికారరూపము గల్గించిన మాట వాస్తవము. ఈ వికారరూపమే కొందజసభిజ్ఞులను దెలుఁగు సంస్కృత భాషాజన్యమనియు, వికృతియనియు నని పించినది; యనిపించుచున్నది. క్రీస్తుశకమునకుఁ బూర్వము “ఆంధ్రులు” తెలుఁగు దేశమును జయించి, రాజ్యము చేసి, కాలచోదితులయి రాజ్యమును గోల్పోయి, తెలుగు వారి యందు లీనమైపోయిరి. ఇందుచేతనే యాంధ్రుల దేహ చ్ఛాయ రకరకంబుగ నుండును. బాపన 'వెల్లరంగు 'మొదలు కారునలుపు రంగువఱకు గల రంగులుగల్గి యాంధ్రుల దేహ చ్ఛాయ యొప్పుచుండును. ఘూర్జర దేశము మొదలు తెలుఁగు నాటివజకు నాంధ్రుల శిలాశాసనములు ప్రాకృత భాషలోను, బాకృత లిపిలోను సచ్చటచ్చటఁ గసపట్టుచున్నవి. నాఁట నుడియు నేఁటిదనుక “ఆంధ్రశబ్దము” తెలుఁగు శబ్దమునకుఁ బర్యాయపద 'మైపోయినది. నేటికిది చరిత్రాంశ మైనది. ధేనము పాటింపఁదగినది కాదు.
ఆర్యులు బహుశ్రద్ధతో, దూరదృష్టితో ద్రావిడులతో వివాహసంబంధము నిషేధించిరి. అందు ముఖ్యముగా నార్యస్త్రీలకును ద్రావిడ ఫురుషులకును జరుగు 'పెండ్లిండ్లు పాప హేతువని శాసించిరి. 'ఏతత్సంతానమును సంఘబహి స్కృతులనుగాఁ జేయుటకై చండాలాది జాతులను సృష్టించి యందుఁ జేర్చిరి. కాని యర్యపురుషులకును ద్రావిడస్త్రీల
17