పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/237

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దక్షిణాపథము


వారు సేవావృత్తియందు లేరు. స్మృతులు చెప్పిన “సచ్చూ డ్రా గోపనాపితౌ,' అను ననుశాసనము దావిడలోక మెప్పుడు నెఱుంగదు. నాపితులను (మంగలులను) దాకిన స్నాపము చేయకుండుట సంప్రదాయ విరుద్ధము. ఇంతియ శాక మృతాశౌచములయందు స్మృతి నియమములకు మిగుల విజ్ఞములయిన యాచారములు స్మారశూద్రులనఁబడు వెలమ కమ్మ రెడ్డి జాతులయందు సుప్రసిద్ధములు. ఇందు చేతనే స్మృత్యధికారము దక్షిణాపథమునం దేన్నఁడు ప్రచా రముఁ గాంచ లేదని చెప్పుచుంటిమి. గౌతమ ధర్మసూతములు మొదలు పరాశరస్మృతివరకుఁ గల స్మృతులయందు సెచ్చ టను.. జెంచుజాతి దక్క దావిడజాతులు. 'పేర్కొనఁబడి యుండ లేదు. మనుస్మృతియందు మాత్ర మాంధులు బ్లేచ్ఛులుగా , బరిగణింపఁబడి గ్రామబహిష్కృతులయిరి. ఈ ఆంధ్రులు' తెలుగువారు కారు. ఆంధ్రుల మాతృ భాష ప్రాకృతము. తెలుఁగువారి 'మాతృభాష తెలుఁగు. ఆంధ్రభాషాలి. నాగరలిపిని బోలియుండును. వైయాకరణులు తెలుఁగును వికృతియనిరి. ఇది ప్రమాదజనితము. సంస్కృత మెట్టిదో తెలుఁగుగూడ నట్టి దే. అనగా సంస్కృత మెంత స్వతంత్రభాషయో, తెలుగుకూడ 'నంత స్వతంత్రభాష. ఇంతియోకాని తెలుగు సంస్కృత భాషా వికృతి కాదు. కొల వశంబువఁ బెక్కు : సంస్కృత భాషాపదములు, ప్రాకృత భాషా పదములు, సంస్కృతమున 'దావిడశబ్దములు చొరినట్టే\

' 16