పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/233

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిపలుకులు



బడెను, “శ్వేతాంగులయిన యార్యులయందు వర్ణవి భేద మెట్లు సంభవించినది ! సంభవింపనియెడల నీ దిగువఁ జెప్పఁబడు నార్యనిర్ణయమునకు సర్థ మేమి ? బ్రాహ్మణులు శ్వేతాంగు లనియు " స్మృతిక ర్తలు నిర్ణయించిరి. దీనికర్థ మేమి ?' వివ రింతుము. శ్రద్ధగా నాలింపుఁడు.



ఆర్యులు శ్వేతాంగులు, ద్రావిడులు కాలాంగులు. వీరిరువురి రక్త సాంకర్యముచేఁ గలిగిన ప్రసవము యొక్క దేహ చ్ఛాయ రకరకంబులుగ నుండును. అనఁగాఁ డెలుపుగాక, నలువుగాక, తెలుపు సలుపు నడుమనున్న రంగులన్నియు సప్పుడప్పుడు బిడ్డల శరీరమునందు గన్పట్టుచుండును. ఈ కార ఇముచేతనే యార్యులయందు. వర్ణవిభాగ . మేర్పడవలసి వచ్చెను, ఈ వర్ణవిభాగముతో హక్కులయందుఁ దార తమ్యముకూడ సవసరమయ్యెను. అంతియగాని కొంద రాధు నికు లాడునట్లు సంఘ శ్రేయస్సుకొరకుఁ, గార్యవిభాగము చేయబడినది. యని చెప్పుమాట నిరర్థకము, నీర్మూలము, నిరాధారము. పైన వాకొనఁబడిన గుప్తభావమును వ్యక్తీక రించుటకొరకే, దీనికి వర్ణ విభాగమని పేరిడఁబడెను. వర్ణ మనఁగా దేహముయొక్క " రంగు. రంగునుబట్టి యేర్చన విభాగమని , ' యనుమాసర హితముగ. స్పష్టమగుట లేదా ! వైతండికులకు నేమి చెప్పఁగలము ? ఎట్లు నచ్చఁ జెప్పఁగలము ? స్వత్య భేద మెట్లునచ్చునో క్రింద విపులీకరింతుము,

10