ఈ పుట ఆమోదించబడ్డది
83
శశికళ
అమృత వాహినిరీతి అవతరించితివీవు
ఆనందరూపవై అధివసిస్తివి మ్రోల
దివ్యభూముల కెటకొ తేల్చుకొని పోతివే !
దీనజీవిని నన్ను దివ్యుణ్ణిచేసితే !
హృదయాన మోముంచి ఒదిగితిని ఒడిలోన
కదియించి కౌగిటను నుదిటపై చుంబించి
"ఓప్రభూ నీవిద్య
నా ప్రణయ" మన్నావు
సౌరభావృత హస్త
సంస్పర్శ ఓషధై
నూత్న శక్తినిపొంది నూత్న జీవమునంది
యత్న కార్యోన్ముఖుడనై నిలిచితేరాణి!
దివ్యభూముల కెటకొ తేల్చుకొనిపోతివే !
దీనజీవిని నన్ను దివ్యుణ్ణిచేసితే !