ఈ పుట ఆమోదించబడ్డది
శశికళ
82
వర ప్రదానము
దివ్యభూలకెటకొ తేల్చుకొనిపోతివే !
దీనజీవినినన్ను దివ్యుణ్ణిచేసితే !
దేహమే శల్యమై
దినదినము కృశియించి
నీవుదర్శనమీని నిముసమొకయుగముగా
తోవ తెలియని అంధజీవినై కుందితిని
దివ్యభూముల కెటకొ తేల్చుకొని పోతివే !
దీనజీవిని నన్ను దివ్యుణ్ణిచేసితే !
నీకె గురువును నేను
శ్రీకమల పరిమళా
దేశికుడ ప్రియుడనై ఆశించి భాషించి
దీక్షలో శిల్పవిన్యాస పులకితుడనై
దేవి నీరాకకై తీవ్ర వేదనపడితి !
ఏ ముహూర్తపు బలిమొ
ఏ పూర్వ పుణ్యమో