ఈ పుట అచ్చుదిద్దబడ్డది
53
శశికళ
కళ్లల్లో శీతలాలు
కంఠంలో కర్కశోక్తి
పెడమోమై తిరిగినావు
ఎడదలోన దయలుమరిగి అక్కసురాలా !
టక్కులాడి వైపోతివె చక్కనిదానా !
ఒక్కణ్ణై ఎక్కణ్ణో
సుక్కిపోయి సోలియుంటి !
మక్కువ యింతైనలేదె అక్కసురాలా !
ఒక్కణ్ణై ఎక్కణ్ణో
చిక్కినట్టి ఆశ మనసు
ఉళ్లంటక ఏళ్లంటక
ముళ్లదారి పడిపోతిని అక్కసురాలా !
టక్కులాడి వైపోతివె చక్కనిదానా !
ఒక్కణ్ణై ఎక్కణ్ణో
సుక్కిపోయి సోలియుంటి
మక్కువ ఇంతైనలేదొ అక్కసురాలా !