ఈ పుట ఆమోదించబడ్డది
11
శశికళ
కలలోని భావవో ?
కతలోని దేవివో ?
గగన లలనా శిరో రత్మమ్మువో
కలశపాధోరాసి సారసనవో ?
తాండవేశ్వర నాట్య
తాళ తకిట ద్థిమిత
ఝంతర ఝణ క్వణిత్
స్వర్ణ మంజీరవో !
ఓ చెలీ నీవెవరు
ఓ చెలీ నీవెవరు
కలలోని మాయవో ?
కతలోని ధ్యేయవో ?