ఈ పుట అచ్చుదిద్దబడ్డది
113
శశికళ
దీపావళి
దీపావళీ ! విశ్వ
రూపావళీ ! నిత్య
జ్యోత్స్నావళీ ! వృక్ష
శోభావళీ ! దేవి
నా లక్ష్మి నా వాణి,
నా శక్తి నా ప్రతిభయే !
దీపావళీ...!
దీపావళీ ! ప్రణయ
ధూపావళీ ! రాస
గంధావళీ ! తోష
బంధావళీ ! దేవి
నా బ్రతుకు నా చదువు
నా యత్న కార్యార్థమే !
దీపావళీ...!
దీపావళీ ! వర్ణ
లేపావళీ ! దివ్య
చిత్రావళీ ! పరమ
శిల్పావళీ ! దేవి