ఈ పుట అచ్చుదిద్దబడ్డది
111
శశికళ
సత్తువంతా పోయి అందపు
మత్తులో పడిపోయి, హృదయము
ఎత్తు పల్లములోన వణికెను,
చిత్తమున వై రాశ్యమొదవెన్.
తీగెలను స్పందించు విల్లును
రాగ స్వరముల నాడు వేళ్లూ
తూగిపోయే గీతికాతతి
దోగులాడెను దెసలు దెసలన్నీ !
కోయిలలు పాడేనొ వాగులు
లోయలో నృత్యాలు సలిపెనొ !
వేయి మలయానిలము లొకటై
వీచెనో శ్రుతులు శ్రుతులన్నీ !
కోటి పూవులు విరిసినట్లై
కోటి చంద్రిక లలమినట్లై
పాటలే ప్రసరించు బ్రతుకున
బ్రతుకు కదలక శిల్పమై నిలిచెన్.
ఏదియో అమృతాప్లావితమై
ఏదియో ఆనందలీలై
వేదనారహితంపు బ్రతుకై
రోదసీ పధమెల్ల నిండితి
హ్లాదమే విశ్వమై నిలిచెన్.