ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

రాథాకృష్ణ పరబ్రహ్మణేనమః.

క. ఇలవెలఁది మోమునెల నిడు
   చెలువపుఁ గెంబొ ట్టనంగ సిరులను బేర్మిన్
   వెలిసెడిచెన్నపురంబునఁ
   గల రలఘూర్జరులు వర్తకకళా ప్రౌఢుల్ . 1

తే. వారిలో ఖాను దాసాహ్వయార్యుఁ డమల
    సత్యమార్గమునఁ గలిమిఁ జాలఁ గూర్చి
    దానధర్మైకనిరతుఁ డై దైవభక్తి
    బాల కృష్ణుని సేవించి పడసె ముక్తి. 2

క. అతనికిఁ గుశాలుదాసుఁడు
   వితరణ గుణశాలి సాధువిప్రుల నెలమిన్
   సతతముఁ బ్రోచెడిపుత్త్రుఁడు
   కుతుకంబెదఁ బెనగొనంగఁ గూర్మి జనించెన్. 3

ఉ. వెన్నునినంజతమ్ములను వీ డనిబత్తిని డెందతామరన్
    సన్నుతి సేసి సజ్జనుల సర్వవిధంబుల నాదరించి య
    త్యున్నతగౌరవస్థితుల నొంది చతుర్భుజదాసు పుత్త్రునిన్
    గన్నకుశాలుదాసునకు క్ష్మాతలమం దొరు లెన్న సాటియే? 4