ఈ పుటను అచ్చుదిద్దలేదు

71

సశాస్త్గ్రీయంగా ఖండనమండనలు ఛేశారు. ఇంతకూ సాహిత్యభాష ఏయుగానికా యుగం మారిపోతుంది. మారిపోవాలంటారు వ్యవహారభాషావాదులు. సాహిత్యభాష యుగయుగానికి మారిపోతే సాహిత్యంలో అవిచ్చిన్నధార సాంగత్యం తెగిపోతుందనీ, అది పనికిరదనీ అన్నాడు గ్రాంధికభాషావాదులు. ఇరువదవశతాబ్దం డెబ్బదియైదు సంవత్సరాలు గడిచినమీదట ఈ భీషణ సారస్వతసంగ్రామం సింహావలోకనం చేస్తే మనకు అనిపిస్తుంది-ఉభయ వర్గాల వారూ సత్యమే చెప్పారని. నాణానికి రెండువైపులు ఉన్నట్లు. బొమ్మా బొరుసూ ఉన్నట్లు-సాహిత్యభాష మారనూమారాలి. పూర్వతంతు విచ్చేదం జరిగేటట్లు మారనూకూడదనిపిస్తుంది. తెలుగుసాహిత్యభాష సమూలంగా మారిపోతే నన్నయ తిక్కన పోతనల మహా గ్రంధాలను అనుభవించగల యోగ్యత పోగొట్టు కొంతాము. వారి భాషవంటి భాషనే పట్టుకొని కూర్చుంటామంటే ఆధునిక ఆంధ్రసమాజానికి దూరదూరమైపోయి ఉద్దిష్ఠప్రయోజనం బలిచేసినవారమూ అవుతాము. ఈ రెండు మార్గాల సమన్యయంమీదనే ఆంధ్రసాహిత్య భవిష్యత్తు నిలిచ్ ఉంటుందన్నమాట.

      కొంచెం వెనుకకు మరలి ఈ భాషా సంగ్రామంలోని కొన్నిఘట్టాలను స్మరిద్దాము.  తెలుగులో ఆధునిక నిజ్ఞానగ్రంధాల్ వెడలకపోవడం అప్పటి ప్రభుత్వానికి కూడా ఆశ్చర్యం కలిగించింది.  దేశంలో మేధావులు చాలమంది ఉన్నారు.  పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానవీధుల్లో విహరించినవారు ఉన్నారు.  కాని వారు సేకరించినజ్ఞానము ప్రజానీకానికి అందడంలేదు.  ఏమిటి కారణమని బ్రిటిషుపాలక్లు విచికెత్సలో పడ్డారు.  లార్డుకర్జను కాలంలో దీనికి హెతువులు అరయుటక్జోసం ఒక సంఘాన్ని నియమించారు.  వారి విచారణ ఫలితంగా తేలినదేమంటే దేశీయ శాస్త్రవేత్తలకు దేశభాషలో తమ విజ్ఞానాన్ని ప్రజలకు తెలియజెప్పడం కుదరటంలేదు.  ప్రజలకు ఆంగ్లమురారు.  శాస్త్రజ్ఞలకు తెలుగులో భావప్రకటన చెయ్యడం చేతకావడంలేదు.  అందుచేత దేశీయులకు దేశ్యభాషలలో తగినంత పరిజ్ఞానం ఏర్పడాలి.  ఇందుకోసమై విద్యార్ధులచేత దేశభాషలో వ్యాసరచన చేయించాలి.  వారు క్రమంగా తమస్వభాషలో రచన చేయుటకు సమర్దులవుతారు.  ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.  విద్యార్ధుల చేత వ్యాసరచన ఏశైలిలో చేయించాలి అనే ప్రశ్న సముత్పన్నమయింది.  సజీవమైన వ్యవహార భాషలో వ్రాయించాలని గురజాడ అప్పారావు మున్నగు పురోగాములు ప్రకటించారు.  వీరికి ఆంగ్లోద్యోగులు అండదండలున్నాయి.  ప్రాచీన శైలిని సంర్దించేవారికి జయంతిరామయ్యపంతులు, ఆంధ్రసాహిత్య పరిషత్తు అండగా నిలిచాయి.  ప్రభుత్వంలో తమకున్న పలుకుబడి నుపయోగించి భాషాసంస్కారవాదులు స్కూలుఫైనలుపరీక్షలో విద్యార్ధులు ఆధుని శైలిలో వ్రాయ