ఈ పుట ఆమోదించబడ్డది

72

బోరగిలఁ బడ్డట్టి గిన్నెను
వార లాకసమనుచుఁ బిలుతురు
సారెకును బుట్టుచును గిట్టెద

మందు క్రిందఁగదా!

ఓరీ! చేతులనెత్తి దానికి
చేరి దండము పెట్టనేటికి
మీరు నేనునునట్లె యదియును

శక్తిహీనకదా.


73


అతిశయోక్తులె సత్యమంట
క్షితిని గావున చింతయేఁటికి
మతిని కలఁతను బొంది యుండకు

మోయి యెన్నడును

గతియెటున్నదొ యట్లె పోవుము
వెతను బూనకు వ్రాఁతయెట్టి
గతిని పట్టునొ దానిఁ ద్రిప్పఁగఁ

దరమె యేరికిని,

37

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/43&oldid=322247" నుండి వెలికితీశారు