88
రంగూన్రౌడీ.
జయ - మహారాజ్ !
గంగా - నాకు పెద్ద -- నాకు పెద్ద—-పెద్ద - పెద్ద--(వణఁకును.)
జయ - ఏమిటి ! నీకు పెద్ద?
గంగా - ఉండవోయ్- ఉండు. కొంచెము తమాయించుకోనీ! కొంచెము శాంతపడనీ! తొందరపెట్టకూ అబ్బా! చూడు గుండెలు కొట్టు కొంటున్నాయి !
జయ - ఏమిటి ! సైతాన్ కాదు గదా ?
గంగా - (అదిరిపడి) బాబోయ్! దర్వాన్? (వెఱ్ఱికేక పెట్టును.)
జయ - అరే భగవాన్ !
గంగా - ఉండు. నాకు - పెద్ద --- నాకు - పెద్ద--
జయ - ఆఁ! ఆఁ! పెద్ద – పెద్ద - ఏమిటో తమాయించుకొని చెప్పండి. గాభరా పడకండి.
గంగా -- నాకు పెద్దజ్వరం వచ్చిందోయ్ దర్వాన్ !
జయ - ఎందుకనీ ! మీ కిప్పుడు జ్వరం ?
గంగా - ఎందుకా ! ఎందుకా నువ్వెఱగవూ! నాకొంపలో సైతాన్ చేరింది; నాలో సైతాన్ చేరింది; నాకూతురులో సైతాన్ చేరింది ఇంతకు నువ్వు దర్వాన్ వో సైతాన్ వో తెలియకుండా వుంది.
జయ - నేను సైతాన్ ఎందు కవుతానూ? నేను; దర్వాను నే !
గంగా - ఏమో! ఓసైతాన్!-
జయ - సైతాన్ కాను; దర్వాన్ .
గంగా - దర్వానూ సైతానూ ఒక్కటేరా బాబు. ఒక్కటే నువు ప్రవేశించాకే నాకొంపలో సైతాను ప్రవేశించింది.
జయ -- సరే కాని, మీజ్వరానికి కారణ మేమిటి ?
గంగా -- సైతాన్ భయముచేత విజయనగరం వెళ్లి సానికొంపలో సరసా లేడ్చాను. బాబో! అక్కడే! అక్కడే! అక్కడే జరిగింది. —-