పంచమాంకము.
75
జయ – జీ సేట్ మహరాజ్ ! హుకుం కా మాఫిక్ (రామాయణము తెచ్చి చదువును.)
ద్విపద.
హనుమంతుఁ డావేళ అంబుధిదాటి
ఘనమైనలంకలో కాలుమోపఁగనె,
రాక్షసుల్ భీకరారవములతోడ
భక్షింతు మని వాని పైఁబడరాగ
భూతముల్ దయ్యముల్ బొబ్బల నిడుచు
క్రోతిపై డీకొని గొంతుక పిసుక--
గంగా - హే ! ఉండుండు, అట్టే చదువకు.
జయ - క్యా హై మహరాజ్ !
గంగా - కుచ్ నహీ మహరాజ్ ! అరే బాప్రే! బాప్! రామాయణం విందామన్నా రాకుసులూ దయ్యాలేనా!
జయ – రామాయ న్మే సొబ్ అయిసా హైనా సేట్సాబ్ !
గంగా -- ఏదైన శృంగారమున్నభాగం చదవ్వోయి !
జయ - ఇస్మే కహాఁ మిలేగా సింగారం ?
గంగా - అయిసాహై తో రామాయణ్ ఛోడ్ దేవ్'. మహాభారత్ పఢో.
జయ - జీ!
(మహాభారతము తెల్చి చదువును.)
ద్విపద.
అపుడు కీచకుఁడు మోహావేశమంది
అపురూపసుందరియైన సైరంధ్రి
మొగమునుఁ జూచి సమ్మోహితుండయ్యె
విగతధైర్యుండయ్యె విరిశరాహతుల
అతఁడు సైరంధ్రితో నతిప్రేమ మీఱ
కుతుకాన రమ్మంచుఁ గోరికఁ దెలిపె