చతుర్థాంకము.
59
గంగా - (కోపముతో) అరే సువ్వర్కా, బచ్చా ఛూప్ (కొట్టును బాలుఁడు మరింత యేడ్చును.)
గంగా - అరే ఖుదా! మై క్యాకరుం ! అరే దర్వాన్ ! ఇదరావ్ యార్ - బచ్చా రోతా హై దర్వాన్ !
జయ - [ప్రవేశము] అరే భగవాన్ ! ఆర్చి ఆర్చి హైరాన్ అయిపోయినాన్రా బాబూ ! ఈ పిల్లవాణ్ణి లోపల్కి తీస్కెళ్ళి తల్లికిచ్చేసిరా ! వెళ్ళు.
జయ - సేట్జీ ! తమ కొకఉత్తర మొచ్చింది.
గంగా - ఇచ్చేసి వెళ్ళు. వేగిరంగా మళ్ళీ రావాలిసుమా !
జయ - (బాలునితో నిష్క్రమించును.)
(తిరిగి ప్రవేశము.)
గంగా -- (ఉత్తరము విప్పి చదువును.)
శ్రీరస్తు.
“భయంకర వీరదుర్గామహాశక్త్యై నమః గంగారాంసేట్గారి సన్నిధికి-
మీయింటిని మీకుమార్తెను ఆశ్రయించిన భూతం వ్రాసేదేమనఁగా."
గంగా - అరే బాబూ ! భూతం వ్రాసిన ఉత్తరమా ! భూతము అంటే?
జయ - భూతం అంటేనా? సైతాన్ !
గంగా - అరే దర్వాన్ !
జయ - అరే భగవాన్ !!
గంగా - ఈదయ్యపుత్తరం చూస్తే నాగుండె దడదడ లాడుతుంది. దీన్ని చదివి వినిపించు.
జయ - (చదువును.)
"నేను నీకుమార్తె యైన రాధాబాయిని ఆశ్రయించి వున్నాను. నేను మగభూతాన్ని. నీకుమార్తెమనస్సు జయరాం అనే వాఁడిమీద