100
రంగూన్రౌడీ.
పావనంబగు భగవద్గీతపైన వి
శ్వాసార్హమైనట్టి ప్రతిజ్ఞ జేసి,
పెనఁగులాడితి స్వామి నావిభునికొఱకు.
అఖిలదోషముల్ మన్నించి యన్నపూర్ణ
భావిజన్మంబులందున ప్రాణనాథుఁ
గాగ శంకరుఁ గూర్పుమోకలుషహరణ !
అయ్యా ! నా ప్రార్థనము పూర్తియైనది. ఇంక మీకర్తవ్యమును నడుపుఁడు.
జైలు - కిరాతుఁడా! నీ పని కానిమ్ము.
కిరా - (కత్తి నెత్తును.)
[శంకరరావు పటాక్షేపమున ప్రవేశము.]
శంక -- నిలుపుము - కిరాతుఁడా ! ఆఖడ్గమును నిలుపుము -
అన్నపూర్ణా! అన్నపూర్ణా! నీవు నిర్దోషివి. ని న్నీస్థితికిఁ దెచ్చిన పాపాత్ముఁడను నేను. నే నుండగా నీవేల వధింపఁబడవలెను ? లెమ్ము, చేసిన సర్వవిద్రోహములకును ఉరిశిక్ష ననుభవింప నేను వచ్చితిని. నామనవి వినుము. పవిత్రురాలవగు నీ కాపాపప్రదేశము తగినదికాదు. నేను జడ్జిగారికి వ్రాసికొంటిని. నీవధను నిలుపుటకై ఆజ్ఞాపత్రము రాగలదు. రమ్ము - క్రిందికి రమ్ము,
అన్న - నీపాప మేమో నీ వేమో నే నెఱుఁగను. గిరికుమారియింట నేను రెండుహత్యల నొనరించినహంతకి నగుటవలన శిక్షింపఁ బడుచున్నాను. అయ్యా ! మీరేల విభ్రాంతులై యింకను చూచుచున్నారు ? మీ రీయున్మత్తునిమాటలను విశ్వసించుచున్నారా ? రాజద్రోహ మొనర్చుట మీకు తగదు. నన్ను వధింప నాజ్ఞయిండు.