ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఢిల్లీకిని, మీవారునకును సంధి

199


రావించి వారి పాలుమాలినతనమునకు మూర్ఖతకు గట్టిగఁ జీవాట్లు పెట్టి చక్రవతి౯ని విడిపింపకున్నచో నందఱి ప్రాణములఁ దీయింతునని బెదరించెను.

ఏలయన పరాక్రమవంతుఁ డగునొకతునక జోదు రోసముఁ దెచ్చుకొని చక్రవతి౯ని విడిపించుట కారాత్రి యత్నించెనుకాని వానియత్నము నెరవేరదయ్యె. మరునాఁడుదయమున నూర్జహాను స్వయముగ నేనుఁగు.నెక్కి కత్తియు విల్లు నమ్ములు చేఁబూని తన సేనలం బురికొల్పికోని మహబత్ఖానునిఁ దాకుటకు రాఁబోవుచుండెను. అప్పుడు రాజపుత్రులు పడవలవంతెనఁ గాల్చి వారిని రాకుండఁజేయ వారు పాటి రేవులం దిగి రాఁజొచ్చిరి. రాజపుత్రులు వారిపై శరవర్షంబులు గురియించియు తుపాకి గుండ్ల బ్రయోగించియు నూర్జహాను సేనలనురుమాడి నీటనున్న వారిని నీటను మెరకనున్న వారిని మెరకను జంపిరి. కొండఱు ప్రవాహవేగమున కొట్టుకొని పోయిరి. అన్ని గండములను గడపి దరిజేరిన వారిని కత్తులతో నరికి చంపిరి. మహబత్ఖానుఁడు వాని రాజపుత్ర సైనికులు విజయము సంపూర్ణముగ నందిరి, గాని యాతనిజయము చిరకాలము నిలువదయ్యె. ఏలయన నూర్జహాను పౌరుషంబు లగుచేతలు చేయలేక పరాభవము నోంది యాగడుసుపోకడలం బోయి కార్యము సాధించు కోనియె. ఆమె నిర్భయముగ మహబత్ఖాను నిశిబిరముఁ బ్రవేశించి నా భత౯ తో పాటు నన్ను గూడ ఖయిదీగాఁ జేయుమని యూతనింగోరెను. మహబత్ఖాను ను మిక్కిలి యుబ్బిపోయి సరేయని యూరకుండెను. అది సందు చేసికొని యామె నేనాథిపతులమనస్సులు విరువ నారంభించెను. అదివఱకే ఖానుయొక్క యనుచరులలోఁ గొంద ఱతనిగర్వమును జూచి వానిని ద్వేషించు చుండిరి. కొందఱు వాని రాజపుత్ర పక్షపాతమును జూచి కడుపుమంట గలిగి యుండిరి.అందుచేత సూర్జహాను పన్ను గడ లవలీలగ వారిమతములఁ ద్రిప్పెను. కొన్ని దినము లామె తాను శిబిరములోనుండి యెట్టకేలకు చక్రవతి౯నిఁ జెరనుండి విడిపించి స్వతంత్రునిఁ జేసెను. అప్పుడు ఖానుఁడు రాజపుత్ర సైనికులు భగ్న మనోరథులై తమయవివేకమునకుఁ జింతించుచుఁ దొలఁగి పోయిరి