ఈ పుట ఆమోదించబడ్డది

అతడు మంచి వక్త. తార్కికుడు. నిశితదృష్టి, వాదపటిమ కలవాడు. అతని లేఖల్లో తర్కం, వాదవివాదాల పట్ల ప్రీతి, ప్రత్యర్ధితో సూటిగా వాదించడం మొదలైన లక్షణాలు కన్పిస్తాయి. యూదరబ్బయిగా వున్నపుడే అతనికి ఈ లక్షణాలు అలవడి వుండవచ్చు.

పౌలు గొప్పవ్యవస్థావ కుడు. చాలతావుల్లో క్రైస్తవ సమాజాలను స్థాపించి వాటిని సుసంఘటితం చేసాడు. తీతు, తి వెూతి, నీలా వెయి దలైనవారితో పెద్ద శిష్యబృందాన్ని ఏర్పాటుచేసాడు. వారిద్వారా తన కార్యకలాపాలను కొనసాగించుకొని పోయాడు. అసలు అతడు ఓ వ్యక్తి కాదు, ఓసంస్థ. తన సమాజాల్లో క్రమశిక్షణను ఖండితంగా అమలు పరచాడు. కొరింతు విశ్వాసులు అదుపు తప్పగా వారిని నేర్పుతో దారికి తీసుకవచ్చాడు.

ఇంకా అతడు మహా పేషితుడు. కొన్నివేల మైళ్ళు ప్రయాణాలు చేసి యూదులకూ గ్రీకులకూ గూడ క్రీనుని బోధించాడు. ఎన్నో నూత్నసమాజాలు స్థాపించాడు. అతడు మంచి సంఘకాపరి. తాను స్థాపించిన దైవసంఘాలను గూర్చి నిరంతరం జాగ్రత్తపడేవాడు, ఆందోళనం చెందేవాడు - 2కొరి 11,28.

పౌలు పేషిత సేవలో చాల విజయాలు సాధించాడు. దైవదర్శనాలు పొందాడు. జీవన్ముకుడు అయ్యాడు. ఐనా తన్ను గూర్చి గొప్పలు చెప్పకోలేదు. వినయంతో తన విజయాలన్నిటినీ దేవునికే ఆరోపించాడు. దేవుని అనుగ్రహం వల్లనే నేనిప్పడున్న స్థితిలో వున్నాను అని నిగర్వంగా చెప్పకొన్నాడు - 1కొరి 15,10.

పౌలుని అతని విశ్వాసులు గాఢంగా ప్రేమించారు. L