40
నాయకురాలు
నర : రాజుగారి యీ నిశ్చయమువలన మనకు జయముకలిగినట్లే భావిస్తాను.
కే : నిశ్చయం.
నర : మాటలసందున మనం గమనించలేదుగాని అడవి రాను రాను దూర సందులేకుండా పెనవేసుకొని, ఏ కొమ్మ దేనిదో చెప్పడానికి వీలులేకుండా వున్నది.
కే : ఎడం లేకపోవడంచేత ఒక దానికొమ్మ యింకొకదానికి అంటుబడుతున్నది.
నల : అది కొమ్మలకు స్వభావమే. అందుకనే చెట్లు దూరంగా నాటమన్నా రు.
నర : మీరు పొరబడుతున్నారు. అన్ని కొమ్మలూ అట్లా అంటుబడవు. కొంతవరకు అది చెట్టునుబట్టి వుంటుంది.
కే : పండ్లచె ట్లంటుబడతవిగాని ముండ్లచె ట్లెక్కడైనా అంటుబడడం చూచారా?
నల : ముండ్లచె ట్లెవరూ అంటుదొక్కరు.
నర : పల్నాటిలో కొమ్మలు ఇతరచెట్ల కంటుబడవుగూడాను.
నల : దానికి కారణము అన్నీ ముండ్లచెట్లు కావడమే .
కే : కారణ మేదైనా, అది మాకు గౌరవమే. నల: చూ డిక్కడ, పులెడుగుల జాడ లున్నవి.
కే : పులులకేమి ? ఈ ప్రాంతమున పులులు, అడవిపందులు ఏట్లాడుతుంటవి.
నల : ఊళ్లదగ్గర పులులు చెర్లాడుతుంటే జనులకు భయంగదా?
కే : ఒక్కొక్కప్పుడు పులులు ఊళ్లమీది కెగబడుతుంటే మనుష్యులు కర్రలతో కొట్టి చంపుతుంటారు.