ఈ పుట ఆమోదించబడ్డది
92
మూర + ఎడు = మూరెడు
వీసె + ఎడు = వీసెడు
ఇందు 'ఎడు' అపదము. అనగా స్వతంత్ర ప్రయోగములేనిది.
21. అల్లోపసంధి :
అది - అవి శబ్దముల అకారమునకు సమాసమున, లోపము బహుళముగ వచ్చును.
ఉదా : ఎక్కడ + అది = ఎక్కడిది
ఎట్టి + అది = ఎట్టిది
నా + అది = నాది.
22. తకారదేశసంధి :
చు వర్ణంబు తోడి, దుగ్దకారంబు తకారంబగు.
ఇచ్చు + దును = ఇత్తును
వచ్చు + దము = వత్తము
తెచ్చు + దును = తెత్తును
చూచు + దము = చూతము
నియమించు + దురు = నియమింతురు.
23. తచ్చబ్ద వకారలోపసంధి :
ఉన్న - కల - న వర్ణముల మీది తచ్చబ్ద వ కారమునకు, లోపము విభాషణగు.
సులభ వ్యాకరణము