ఈ పుట ఆమోదించబడ్డది
77
ఉదా : - సరసము + మాట = సరసపుమాట - సరసంపుమాట
సౌందర్యము + పాలు = సౌందర్యపుపాలు - సౌందర్యంపుపాలు
ఆకాశము + పందిరి = ఆకాశపుపందిరి - ఆకాశంపుపందిరి.
7. సరళాదేశసంధి :
ద్రుత, ప్రకృతికముమీది, పరుషములకు సరళములగు. ద్రుతమనగా నకారము - నుకారము - న్ - లుగా గ్రహించవలెను. ద్రుతప్రకృతికముల తరువాత నున్న క చ ట త ప అను వర్ణములకు సరళములగు గ జ డ ద బలు ఆదేశములగును.
క | చ | ట | త | ప | పరుషములు |
గ | జ | డ | ద | బ | సరళములు. |
ఉదా : - పూచెను + కలువలు = పూచెనుగలువలు
తోచెన్ + చుక్కలు = తోచెనుజుక్కలు
చేసెన్ + టక్కులు = చేసెను డక్కులు
నెగడెన్ + తమములు = నెగదెను దమములు
మొగిడెను + పద్మము = మొగిడెను బద్మము.
II. ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషణలు విభాషనగు. ఆదేశ సరళములనగా, వ్యాకరణ కార్యము వల్ల వచ్చిన గ జ డ ద బ లు
బిందువు - సున్న - ౦
సులభ వ్యాకరణము