66
వర్గ ప్రధమాక్షరములగు (క చ ట త ప లు) - అనునాసికములు పరమగునప్పుడు ఆయా వర్గాను నాసికములు ఆదేశమగును.
వర్గమందలి తొలి అక్షరములైన క చ ట త ప లకు - న మ లు పరమగునపుడు ఆయా వర్గముల తుది వర్ణములు ఆదేశమగును.
వాక్ + నైపుణ్యము = వాఙ్నపుణ్యము
వాక్ + మహిమ = వాఙ్మహిమ
రాట్ + నిలయము = రాణ్ణిలయము
రాట్ + మందిరము = రాణ్మందిరము
జగత్ + నాధ = జగన్నాధ
కకుప్ + నేత = కకుబ్నేత
లసత్ + మూర్తి = ల సన్మూర్తి
మృట్ + మయము = మృణ్మయము
ఇది ఆదేశ సంధి.
6. జస్త్వసంధి :
గ జ డ ద బ లకు ఆదేశముగ వచ్చు సంధి జస్త్వ సంధి.
పరుషములకు అచ్చులుగాని, వర్గ తృతీయ - చతుర్థాక్షరాలుగాని - హయ వరలు పరమైనచో గ జ డ ద బ లు ఆదేశములగును.
వర్గ ప్రధమాక్షరాలు : క చ ట త ప లు.
పరుషములు.
వర్గ తృతీయాక్షరములు : గ జ డ ద బ లు
సరళములు.
సులభ వ్యాకరణము