ఈ పుట ఆమోదించబడ్డది
55
11. జడ. పదంబుల ద్వితీయకు ప్రధమ యగు
ధనము - చెట్టు - జడవాచకములు. వాని ద్వితీయకు ప్రధమ వచ్చి - దొంగలు ధనమపహరించిరి - దేవదత్తుడు చెట్లు పెంచెను - అని కాని లేక వెనుకటివలె ని - ను లు చేర్చిగాని వాడనగును. రాముడు కుక్కను కొట్టెను అనుచోట కుక్క జడము కాదు. కాన రాముడు కుక్క కొట్టెను, అని కుక్క శబ్దమునకు ప్రధమ రాదు.
12. వచ్యార్థా ముఖ్య కర్మంబునకు - తో - తోడ కి - కు లు తరుచుగానగును. వచ్యర్థమనగా చెప్పుట - దాని ప్రధానకర్మకు ద్వితీయ యగును.
రావణునితో విభీషణుడు నీతులు చెప్పెను.
జానకకి త్రిజట స్వప్నమును దెల్పెను.
రావణుడు - జానకి - అముఖ్య కర్మలు.
నీతి - స్వప్నము - ముఖ్యకర్మలు.
13. కర్త ప్రధానమైన కర్త్రర్ధక వాక్యము.
కర్మ ప్రధానమైన కర్మర్థకవాక్యము.
రాముడు సంహరించెను - కర్త ప్రధానము.
రావణుడు సంహరింపబడెను - కర్మ ప్రధానము.
14. ప్రధానమును బట్టి క్రియల లింగవచన పురుషములుండును.
కర్త్రర్థక వాక్యము | కర్మర్థకవాక్యము |
శ్రీకృష్ణుడు నన్ను రక్షించును | - శ్రీకృష్ణునిచే నేను రక్షింపబడుదును. |
గురువు మమ్ము చదివించును | - గురునిచే మేము చదివింప బడుదుము. |
నేను నిన్ను ప్రార్దింతును | - నీవు నాచే ప్రార్థింపబడుదువు. |
మేము మిమ్ము పూజింతుము | - మాచే మీరు పూజింపబడుదురు. |
నీవు దుష్టులను దండింతువు | - దుష్టులు నాచే దండింపబడుదురు. |
మీరు కీడును చేయరు | - కీడు మీచే చేయబడదు. |
సులభ వ్యాకరణము