ఈ పుట ఆమోదించబడ్డది
42
యలు నాలుగు కాకా తక్కిన ధాతువులు కొన్ని చేరి అర్ద భేదము కలిగించును. అవి శబ్దపల్లములు. నిలుచుండు - కూరుచుండు - చొప్పడు - ఆకొను - ఈకొను - అలవడు - ఏరుపడు - తలపోయు - విజయంచేయు - పరుండు - మేలుకొను మొదలైనవి.
కార్యమును బట్టి సమాపక క్రియలు - అసమాపక క్రియలు అని రెండు రకములు.
సంపూర్ణాభిప్రాయమును దెల్పునవి సమాపకక్రియలు.
కృష్ణార్జునులు ఖాండవ వనమును దహింపజేయించిరి. - ఇట చేయించిరి అనునది సమాపకక్రియ.
సంపూర్ణాభిప్రాయమును తెలుపనివి అసమాపకక్రియలు.
కృష్ణార్జునులు అగ్నిదేవునికి సహాయపడి, ఖాండవ వనము దహనము చేయించిరి. ఇటు సహాయపడి - అనునది అసమాపకక్రియ.
ప్రతి ధాతువునకు నాలుగేసి కాలములు - మూడేసి పురుషములు - రెండేసి వచనములుండును.
జరుగుచున్న కాలబోధకము వర్తమానకాలము
ఏ | - బ | |
ప్ర | -చదువుచున్నాడు -చదువుచున్నది |
-చదువుచున్నారు. -చదువుచున్నవి. |
మ | -చదువుచున్నావు | -చదువుచున్నారు. |
ఉ | -చదువుచున్నాను | -చదువుచున్నాము. |
సులభ వ్యాకరణము