ఈ పుట ఆమోదించబడ్డది
39
గ్రక్కునన్ - చయ్యనన్ - తటాలునన్ - తెప్పునన్ - తోడుతన్, తోడ్తోన్ - దాకన్ - దబ్బునన్ - ఫక్కునన్ - పెందలకడన్ - బొత్తిగన్ - మెట్టుకున్ - వలెన్ - వెంబడిన్ - సారెకున్ - అక్కటా, అయ్యో - ఆహా - ఊరక - ఓహో - ఔర - కదా - ఇంచుక - కొంచెము - ఇసుమంత - గోరంత - మడి - పదవడి - ఒకొ - అప్పుడు - ఇప్పుడు - ఎప్పుడు - రకము - అట్లు - ఇట్లు - ఎట్లు - కట్టా - కటకటా - ఏమి - ఏల - ఛీ - తలా - కరము - మునుకొని - హా - హోరాహోరి - కాని - కాబట్టి - మిక్కిలి - యు - ను - అను సముచ్చయములు.
ధాతువులనుండి పుట్టిన అవ్యయములను లాక్షిణికావ్యయములందురు.
(1) క్త్వార్దక (2) వ్యతిరేకక్త్వార్దక (3) శత్రర్దక (4) తుమర్దక (5) అనంతర్యార్దక (6) చేదర్దక రూపములను లాక్షిణికావ్యయములందురు. అవి.
చదివి | క్త్వార్దకము |
చదువక | వ్యతిరేకక్త్వార్దకము |
చదువుచున్ | శత్రర్దకము |
చదివింపన్ | తుమర్దకము |
చదివించుడున్ | అనంతర్యార్దకము |
చదివించినన్ | చేదర్దకము |
ఇవి చదువు అనుధాతువు నుండి పుట్టిన లాక్షణికావ్యములు.
సులభ వ్యాకరణము