38
చదువు బాలుడు
చదివెడు బాలుడు
చదివెడి బాలుడు
ఇందు చదువుచున్న - చదివిన - చదువగల - చదువని - చదువు - చదివెడు - చదివెడి అను నేడును చదువు ధాతువు నుండి పుట్టిన విశేషణములు. ఇట్లే ప్రతి ధాతువు నుండి ఏడేసి విశేషణములు పుట్టును.
v. క్రియాజన్య విశేషణములకు తచ్చశబ్దమును చేర్చుటవలన క్రియాప్రయుక్త విశేషణము లేర్పడును.
ఉదా : - వచ్చినవాడు ఫల్గుణుడు.
ఆడుచున్నవాడు పుష్కరుడు.
దుమికెడివాడుత్తరుడు.
ఇందు వచ్చినవాడు - ఆడుచున్నవాడు - దుమికెడివాడు - అనునవి క్రియాప్రయుక్త విశేషణములు.
4. అవ్యయములు
లింగ, వచన, విభక్తులు లేని పదములు అవ్యయములు. ఇవి ప్రతిపదోక్తములు, లాక్షణికములు అని రెండు విధములు.
స్వతస్సిద్ధములైన అవ్యయములను ప్రతి పదోక్తములందురు.
అవి :- అంతటన్ - అదిగోన్ - అందులకున్ - ఇందున్ - ఇదిగోన్ - ఇందులకున్ - ఎందులకున్ - ఎట్టకేలకున్ - కడున్, కాబోలున్ - కాపుతన్ - కావునన్ - క్రచ్చరన్,
సులభ వ్యాకరణము