ఈ పుట ఆమోదించబడ్డది
21
శ్రీ - హ్రీ - ధీ - గ్లౌ - స్త్రీ - మా. మొదలైనవి.
మిత్ర శరణ ప్రధాన పాత్రాదులు పుల్లింగ రూపమునను, నపుంసక రూపమున నుండును.
మిత్రము - మిత్రుడు - శరణము - శరణుడు - ప్రధానము - ప్రధానుడు - పాత్రము - పాత్రుడు - భాజనము - భాజనుడు - వృద్ధుడు. మొదలగు కొన్ని పదములలో డు - వర్ణ కంబు లోపించును. ఉత్వము లోపించదు.
వృద్ధుడు - వృద్ధు; గృహస్థుడు - గృహస్థు; మూర్ఖుడు - మూర్ఖు; నీచుడు - నీచు; ఛార్వకుడు - చార్వాకు - మొదలైనవి.దూత మొదలగు కొన్నింటికి ఉత్వ'డు', వర్ణకంబులు లోపించును.
దూతుడు - దూత
యోధుడు - యోధ
శుంఠుడు - శుంఠ మొదలైనవి.
విశ్వకర్మ మొదలగు పదములకు ఉత్వ'డు', వర్ణకంబులు రావు.
విశ్వకర్మ - కృష్ణవర్మ - అశ్వత్థామ - యజ్వ - బ్రహ్మ మొదలైనవి.
దీర్ఘంబు మీది హల్లునకు ద్విత్వంబు వైకల్పికము.
వాక్కు - వాకు; విరాట్టు - విరాటు - మనస్సు మొదలగు పదములకు ద్విత్వము వైకల్పికము. 'న'కారంబు లోపమై ము వర్ణకము వచ్చును.
మనస్సు - మనసు - మనము
శిరస్సు - శిరసు - శిరము.
సులభ వ్యాకరణము