ఈ పుట ఆమోదించబడ్డది
124
9. మాలిని : -
న న మ య య, యుతంబైనాగ విశ్రాంత మైయి
ట్లనుపమగుణ ! మాలిన్యాహ్వయంబయ్యె ధాత్రిన్.
న, న, మ, య, య, అను గణములు వరుసగా నుండి, 9వ అక్షరము యతి చెల్లిన, మాలిని వృత్తమగును. అక్షరములు 15.
ఉదా :
న | న | మ | య | య |
ǃǃǃ | ǃǃǃ | UUU | ǃUU | ǃUU |
సురప | తిసభ | ఁజూడంజూ | డనంగా | రవృష్టుల్ |
యతి సు - జూ - ప్రాస - ర.
10. స్రగ్ధర : -
శ్రీమన్మూర్తీ ! మకరా శ్రి తరభనయయా సేవ్యమై సానుమద్వి
శ్రామంబున్ సానుమద్విశ్రమమున మరగాస్రగ్ధరావృత్తమయ్యెన్.
మ, ర, భ, న, య, య, య గణములతో కూడియుండి 8 - 15 అక్షరములు యతి చెల్లిన స్రగ్ధరావృత్తమగును. అక్షరములు 21 ఉండును.
ఉదా :
మ | ర | భ | న | య | య | య |
UUU | UǃU | Uǃǃ | ǃǃǃ | ǃUU | ǃUU | ǃUU |
ధ్వాంతారా | త్రిప్రభుం | డైతన | రుచువె | లిగెన్‌త | ద్రణవ్యో | మవీధిన్ |
సులభ వ్యాకరణము