ఈ పుట ఆమోదించబడ్డది
121
4. మత్తేభము : -
స్మయదూరా ! విలస త్రయోదశ యతిన్ మత్తేభ వి క్రీడితా
హ్వయమయ్యెన్, సభరమ్ములున్, సమయన వ్రాతంబులున్ గూడగాన్.
స, భ, ర, న, మ. య. వ - అనుగుణములు వరుసగా నుండి, 14 వ అక్షరము యతి చెల్లిన, మత్తేభము. అక్షరములు 20.
ఉదా :
స | భ | ర | న | మ | య | వ |
ǃǃU | Uǃǃ | UǃU | ǃǃǃ | UUU | ǃUU | ǃU |
మహిళా | మండలి | కీవునే | తవయి | సన్మానం | బులన్గాం | చియీ |
యతి - మ - న్మా - ప్రాస - హి.
5. మత్తకోకిల :
శ్రావకాభరణాంక ! విన్ రసజాభ రేఫలదిగ్విరా.
మావహంబుగ, మత్తకోకిల యండ్రు, దీని కవీశ్వరుల్;
ర, స, జ, జ, భ, ర - అను గణములు వరుసగా నుండి 11 వ అక్షరము, యతి చెల్లిన మత్తకోకిల. అక్షరములు 18.
సులభ వ్యాకరణము