పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/64

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలావతికథ.

51

లించుకొని అమ్మా! నీవు దుఃఖింపకుము. శ్రీహరిం దలంపుము జన్మ జరావ్యాధిశూన్యంబగు వైకుంఠమునకుం బోవుదువుగాక !అనికన్నుల నీరునించుచు నుపదేశించుచుండెను. అంతలో నాబ్రాహ్మణుఁడరుదెంచి జాంగలికులం బిలిపించి చికిత్సచేయించెం గాని విషమువిరిగినది కాదు.

అప్పుడగ్గోపిక నారదునొడిలో నిడికొని యాభూసురునకప్పగించుచుఁ డండ్రీ! నీ ముద్దుముచ్చటలు చూచుటకు నాకును మీతండ్రికిఁగూడ యోగములేకపోయినది. ఈపాఱుఁడే నీకుఁ దండ్రి. అమ్మహర్షులే నీకు గురువులు వీరినాశ్రయించిన నీకుసహాయము చేయుదురు. నేను నిన్ను విడచిపోవుచున్నదాన నామాటలు మఱువవలదని పలుకుచునే ప్రాణములువదలినది. ఆవార్తవిని యమ్మహర్షులువచ్చి దేహవాసనచే దు:ఖించుచున్న నారదు నూరడించుచు తత్వోపదేశముగావించిరి.

పెంచిన బ్రాహ్మణుఁడా గోపికకిపరిసంస్కారములు సేయించి యాకళావతిసుగుణంబు లుగ్గడింపుచుఁ బెద్దగావిలపించెను. నారదుండును దదుపదేశంబునంజేసి విరుక్తుండైతగు ......... లంగదాయని తలంచుచు నమ్మహర్షులవిడువక శుశ్రూషచేయుచుండెను.

ఆవ్రతంబు బూర్తియైనపిమ్మట నమ్మునులు బదరికారణ్యమునకుఁ బ్రయాణమగుచుండ నారదుండును దానుగూడ వారితోఁ బోయెద నన్నుజ్ఞ యిమ్మనిపెంచిన విప్రునిగోరికొనియెను. నీవుచిన్నవాడవు మహారణ్యములు తిరుగఁజాలవు. కొన్నినాల్లిందుండుమని బ్రతిమాలికొనియెను. కాని యతండంగీకరించక ..................... బదరీ వనంబునకుంబోయెను. నారదుండు .................... దాపసో పదిష్టమగు విష్ణుమంత్రంబు జపించుచుఁ బెద్దకాలము తపంబుగావించి శాపదోషంబు వాని మేనువిడిచి క్రమ్మఱస్వస్వరూపముతో బ్రహ్మలోకంబునకుంబోయి తండ్రికి నమస్కరించెను. బ్రహ్మ కుమారుం గౌఁగలించుకొని యాదరించుచుఁ బెండ్లియాడుమని నిర్బంధించెను.