పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/427

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

249 వ మజిలీ.

కలియుగధర్మములు.

శ్రీకృష్ణనిర్యాణమైన పిమ్మట కలియుగ ప్రారంభమున వ్యాస, జైమిని, గౌతమ, పరాశర, గాలవ శాతాతప, శంఖలిఖితాది మహా మునులొక సభజేసి కలిధర్మములగురించి యిట్లు సంభాషించుకొనిరి.

గౌతముఁడు — మునీంద్రులారా! యిప్పుడు కలియుగము ప్రారంభించినది. ఇందుబ్రాహ్మణులు శ్రుతిచోదితములగు కర్మలు విడిచి శూద్రప్రాయులై వర్తింతురు. వర్ణాశ్రమధర్మములు నామమాత్రా వశిష్టములై ప్రవర్తిల్లును. కావున కొన్ని నియమములు మార్పవలసి యున్నవి. ఇందులకు మీమీ యభీప్రాయముల నివేదింపవలయును. అని చెప్పుచుండగనే నారదమహర్షి యొకచేత మొగంబు నొకచేత గుహ్యాంగంబు మూసికొని యాసభకరుదెంచెను.

అమ్మునివరుంజూచి యందున్న తాపసులెల్ల విస్మయముజెందుచు నాసంకేతక మేమని యడిగిన నారదుం డిట్లనియె. కలియుగ ధర్మముల గురించి మీరు సభజేసి నన్ను రమ్మని వార్తనంపితిరి గదా! తత్సంబంధంబులగు క్రియలసూచించుచు నిట్లు వచ్చితినని చెప్పుచు మఱియు నిట్లనియె.

కలియుగంబునఁ బ్రజలకు నీయింద్రియనియము లేమియు నుండవు. నోరు సత్యమునువిడిచి ధర్మము నతిక్రమించి యిష్టమువచ్చినట్లుగా మాట్లాడుచుండును. స్త్రీపురుషులు విధినిషేధముల విమర్శింపక పశువులవలె స్వేచ్ఛాసంయోగములు గావించుచుందురు. కలియుగంబున నీయింద్రియద్వయమే కడుంగడు దుష్టమై చెడిపోవును. అని సూచింపుచు నిట్లు కప్పికొనివచ్చితినని యెఱింగించి యాముని