ఈ పుట ఆమోదించబడ్డది

త్రైతసిద్ధాంతములోని మూడు ఆత్మలను కర్మలేనివి, కర్మవున్నవి అనియూ, కార్యము చేయునవి కార్యము చేయనివి అనియూ రెండుగా విభజించి, దాని ప్రకారము 2:1 అను సూత్రమును అనుసరించి మిత్రు శత్రుగ్రహములను కనుగొన్నాము. మొదటి సరి బేసి గ్రహములు మిత్ర గ్రహములుకాగా, రెండవ సరి బేసి గ్రహములు శత్రుగ్రహములగునని కూడ చెప్పుకొన్నాము. దానిప్రకారము మేషలగ్నమునకు ద్వితీయ, తృతీయ స్థానాధిపతులైన మిత్ర, చిత్ర గ్రహములు, అలాగే షట్, సప్తమ స్థానాధిపతులైన బుధ, శుక్రులు మరియు దశమ, ఏకాదశ స్థానాధిపతులైన రాహువు, శని గ్రహములు ప్రతిపక్షగ్రహములగుచున్నారు. దీనిని బట్టి మేషలగ్నమునకు మిత్ర, చిత్ర, బుధ, శుక్ర, రాహు, శని ఆరుగ్రహములు శాశ్వితముగా శత్రు గ్రహములగుచున్నారు.