కొత్త మనిషి : ఆ వేశ్య ద్రవ్యానికి సాధ్యురాలు కాదండి. సౌజ : అయితే మరేమి కోరుతుంది? కొత్త మనిషి : ఆమె కోరిక అసాధ్యవఁని తలుస్తానండి. సౌజ : అయినా యేమిటో చెప్పండి. కొత్త మనిషి : చెప్పితే మీకు ఆగ్రహం రావడమే కానీ, కార్యం వుండదనుకుంటానండి. సౌజ : తనను వుంచుకోమంటుందా యేమిటి! అది యెన్నడూ జరిగేపని కాదు. కొత్త మనిషి : ఆ ముసలి బ్రాహ్మడి దురదృష్టం! మనవేఁం చెయగలవండి? సౌజ : యెంత బుద్ధిహీనురాలు! అసందర్భమైన యిలాటి కోరిక కోరతగునా? మీరెలా మోసుకొచ్చారు యింత అసంభావితమైన మాట? కొత్త మనిషి : వ్యవహార విషయములు మాట్లాడుతూన్నప్పుడు మంచైనా, చెడైనా ఉన్న మాటలు నాలుగూ అనుకోవడం విధాయకం గదండి. ఆ మనిషి తలకి తగని వెఱకోరిక పెట్టుకుంది అనేమాట అన్నంతినే మనిషల్లా యెరగడా అండి? సౌజ : నేను మన్మధుణ్ణనా నన్ను వలిచింది? కొత్త మనిషి : మిక్కిలీ మంచివారని కాబోలు. సౌజ : సానిదానికి మంచితో పని వుండదు. ఇది యేదో యెత్తై వుండాలి. కొత్త మనిషి : మృచ్ఛకటిక చదివిందేమోనండి. సౌజ : వసంత సేనలాంటి మనిషి వెట్టి కవీశ్వర్ల కల్పనలో వుండాలి గాని, లోకంలో వుండదు. యేదో యెత్తు. అందుకు సందేహం వుండదు - సాధనాంతరం లేదో? కొత్త మనిషి : తమరు ప్రశ్నలు అడుగుతారు. విన్నమాట మనవి చేస్తే ఆగ్రహిస్తారు. యేం సాధనం? సౌజ : శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల ఆగ్రహమనే వస్తువను చంపుకోవడముకు సదా ప్రయత్నం చేస్తున్నాను. స్థాలిత్యం కనపర్చారు. కృతజ్ఞుడను, చెప్పవలసినది చెప్పండి. కొత్త మనిషి : తమకు వుంచుకోవడం మనస్కరించకపోతే, తనను వివాహము కావచ్చునని కూడా ఆ మనిషి అభిప్రాయము. సౌజ : మంచివారిని హేళన చెయ్యవలసినదని కూడా మీ తల్లి గారి ఉపదేశం కాబోలు? కొత్త మనిషి : మీ శ్రీకృష్ణుని మీద ఆన మీ యెడల నాకు అమాయకమైన భక్తి కలదు. తమరి యెడల తృణీకార భావము నా హృదయమందు యెన్నడూ పుట్టదు. నమ్మండి. గురుజాడలు 414 కన్యాశుల్కము - మలికూర్పు
పుట:Gurujadalu.pdf/459
ఈ పుటను అచ్చుదిద్దలేదు