పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/127

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కయిఫియ్యతు

121


వచ్చినది గన్కు వారి అనుగ్రహం చేతను తండ్రి హక్కుకు పాత్రుడై నిజాం పట్నం సర్కారు రుసుం సావరాలు (బిల్మక్తా) బిలుముక్తా గ్రామాదులు యేడు గ్రామాదులలోను కొండ్డూరు రమణాచార్యులు గారికి స్న ౧౧२౦ ఫసలీ (1780 AD) లోను పల్లం పాతిక పొలం యిచ్చినారు స్న ౧౨२౨ ఫసలీ (1862 AD) లోను శిష్టాగురువంబోట్ల గారికి పల్లం పాత్కె మెరక పాత్క వెరశి కుచళ్లు ౦౺౦ యినాం యిచ్చిరంగ్గావఝుల వెంకటాచలం గారికి పల్లము పొలములోకు ౧౪౦ వర్కపాటి యినాము వెరశి పధ్నాలుగు వీశాలు యినాము యిచ్చి సదరహీ ఫసలీ లగాయతు స్న ౧౧२౩ ఫసలీ (1763 AD) వరకు నాలుగు సంవత్సరములు ప్రభుత్వము చేసినారు తరువాతను యీయన కొమారుడైన అయ్యంన్నగారు స్న ౧౧२౪ ఫసలీ (1764 AD) లగాయతు స్న౧౧२౬ ఫసలీ (1766 AD) వర్కు మూడు సంవ్వత్సరములు ప్రభుత్వము చెశ్ని తరువాతను తదనంత్తరం వీరిజ్ఞాతి అయ్ని వెంక్కయ్యగారు స్న ౧౧२२ ఫసలీ (1769 AD) లోను కద్దెళం గోపాలా చార్యులు ఆయ్యవాల౯ గారికి మెర్క వీశాలు కు ౦౺౦ పల్లపు పొలం కు ౦౹౦ పాతికె వెరశి ౦౻౦ ముప్పాతికె మోడూరు షఠగోపాలా చార్యుల వారికి మెర్క కు ౦౺౦ పల్లం కు ౦౦ఽ వెరశి ౦౺ఽ కొండ్ర కొండ్డ కృష్ణమాచార్యులు గారికి పల్లకు ౦౹౦ మెర్క పొలం కు ౦౹౦ యిచ్చినారు. సూత్రాల నరశింహ్మచార్యులుగార్కి గర్వు కు ౦౺౦ కళావంత్తి వీరసానికి పల్లం పాత్కి యిచ్చినారు. వెరశి కు ౨౺ఽ రెండు కుచ్చుళ్లు పది వీసాలు యినాము యిచ్చి సదరహి ఫసలీ మొదలుకొని ౧౧౮౫ ఫసలీ (1775 AD) వరకు తొమ్మిది సంవత్సరములు ప్రభుత్వం చేశెను.

తర్వాతను వీరిజ్ఞాతియైన వెంక్కట్రాయనింగారు స్న ౧౧౮౬ ఫసలీ (1776 AD) లో ప్రభుత్వానికి వచ్చి బచ్చుపేట శ్రీ వేంక్కటేశ్వర స్వామి వారికి పల్లము కు ౦౺౦ అరకుచ్చల మాన్యం యిచ్చి సదరహీ ఫసలీ మొదలుకొని స్న ౧౧౬౧ ఫసలీ (1781 AD) వరకు ఆరు సంవత్సరములు ప్రభుత్వము చేసినారు తదనంతరము స్న ౧౧౯౨ ఫసలీ (1782 AD) లోను సదరహీ వెంకట్రాయనింగ్గారు మొవాశిగిరి (మవాసిగిరి) చేసినంద్ను కుంఫిణీవారు వెంక్క ట్రాయనింగ్గారిని బేదఖలు చేసి జ్ఞాతి అయ్ని మల్లారాయనింగార్ని జమీందారి హోదాలో ఖడాయించ్చినారు. గన్కు సదరహీ ఫసలీ మొదలుకొని స్న ౧౧౯౬ ఫసలీ (1786 AD) వరకు అయిదారు సంవత్సరములు బిలుమక్త (బిల్మక్తా) అనుభవించ్చినారు. తరువాత స్న ౧౧౯౭ ఫసలీ (1787 AD) లోను బిలుమక్త (బిల్మక్తా) జప్తు చేసుకొని మల్లారాయనింగ్గారికి లవనసు నిన౯యించ్చినారు. గన్కు సదరహీ ఫసలీ లగాయతు స్న ౧౨౧౧ ఫసలీ (1801 AD) వరకు పదహారు సంవ్వత్సరములు కుంఫిణీవారు కలకటల౯ పరంగా మామ్లియ్యతు చేసుకున్నారు. స్న ౧౨౧౨ ఫసలీ (1802 AD) సంవత్సరములో కుంఫిణీ వారు తాలూకా యాలంవేసినంద్ను రాజావాశిరెడ్డి వెంకట్రాది నాయుడు. బహద్దరు మన్నె సుల్తానుగారు కొని ఖాజుపాలెంలో గ్రామం వారు శివాలయం కట్టిస్తే నిత్య నైవేద్య దీపారాధనలు జరుగ గలంద్దుల్కు పల్లమున మెరకను ౦౻౦ ముప్పాత్కి యినాము యిచ్చినారు. సదరహీ ఫసలీ మొదలుకొని స్న ఫసలీ ౧౨౨౫ (1815 AD) వర్కు అధికారం చేసినారు. తరువాత స్న ౧౨౨౬ ఫసలీ (1816 AD) లగాయతు యిప్పట్కి ఆమీళ్ల పరంగ్గా అమాని మామ్లియ్యతు జరిగించుకుంటూవుంన్నారు.