ఈ పుట ఆమోదించబడ్డది

వాశిష్ఠ గణపతి ముని విరచిత ఇంద్రాణీ సప్తశతి, వీరేశలింగం పంతులు రాసిన ఆంధ్ర కవుల చరిత్రము, చిలకమర్తి లక్ష్మీనరసింహము రచించిన మహాపురుషుల జీవితములు, పింగళి సూరన ప్రణీత కళాపూర్ణోదయము, గణపవరపు వెంకటకవి కృత శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము - ఇలా ఏ రచన తీసుకుని పనిచేసినా దాని వెనుక ఆయనకంటూ ఒక ఆలోచన ఉంటుంది. తనకు మంచివని తోచిన పూలను వెతికి వెతికి ఇష్టంగా కష్టపడి గుదిగుచ్చి భగవంతునికి భక్తుడు సమర్పించినట్టు అరుదైన, విలువైన, చక్కని సాహిత్య సంపదను ఎంపికచేసుకుని తెలుగు వికీసోర్సులో పెంపొందిస్తున్న గ్రంథమాలి మా గుంటుపల్లి రామేశం.


ఎందరో వికీమీడియన్లు

68