ఈ పుట ఆమోదించబడ్డది

శింగర్ కోయిల్ - 11

ఇచట నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించురీతిని వేంచేసియుందురు. మిక్కిలి ప్రభావముగల సన్నిధి. మార్గము: తిరువహీన్ద్ర పురమును సేవించునపుడు పోయి సేవింపవచ్చును. కడలూర్‌కు 25 కి.మీ.

తిరుమழிశై - 12

జగన్నాథపెరుమాళ్-తిరుమంగవల్లి తాయార్-తూర్పుముఖము-నిలచున్నసేవ-తిరుమళిశై ఆళ్వార్ అవతారస్థలం. మార్గము: మద్రాసు-పూన్దమల్లి-తిరువళ్లూరు మార్గంలో పూన్దమల్లికి సమీపంలో కలదు.

హంపి - 13

సీతారాముల సన్నిధి, నరసింహస్వామి సన్నిధి కలవు-ఋష్యమూక పర్వతము-పంపాసరోవరము-శబరి ఆశ్రమము సేవింపదగినవి. శ్రీరామచంద్రుడు ఇచటనే సుగ్రీవుని ద్వారా వానరసైన్యమును సీతాన్వేషణకై సమావేశపరచినాడు. మార్గము: బెంగుళూరు నుండి హుబ్లీ పోవు మార్గములో హోస్పేట స్టేషన్ నుండి 12 కి.మీ.

154