పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/137

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15,3. అతడు తన సుఖాన్ని తాను వెతుక్కున్నట్లయితే మనకు రక్షణం లభించివుండేదేనా? ఈలా స్వార్ణాన్ని జయించందే, ఓ తల్లిలా తండ్రిలా తోడి ప్రజలకోసం మన జీవితాన్ని సమర్పించుకోండే, ప్రేషితులంగా చలామణి కాలేం.

12. ప్రోటస్టెంటు సమాజాల్లో గృహస్ధులు ఉత్సాహంతో సువిశేషబోధ చేస్తారు. ప్రార్ధనా సమావేశాలు జరుపుతారు. బైబులు బోధిస్తారు. కాని క్యాతలిక్ సమాజంలోని గృహస్తులకు ఈ దృక్పథం లేకపోవడం మన దురదృష్టం. ప్రోటస్టెంటు స్త్రీలతో పోల్చి చూస్తే మన స్త్రీలు చేసే ప్రేషిత సేవ సున్న ఇప్పటి నుండైనా మన ప్రజలు ఉత్సాహంతో ఉదారబుద్ధితో ముందంజవేయాలి, చెలమలో నీళ్లు తీస్తూవుంటే ఇంకా ఊరుతుంటాయి. ఆలాగే మనం కూడ క్రీస్తుని ఇతరులకు తెలియజెప్తూంటే ఆ ప్రభువు తన్ను గురించి ఇంకా తెలియజెప్పాలి అన్న కోరికను మన హృదయాల్లో పుట్టిస్తాడు. మన ద్వారా ప్రభువు తోడిజనానికి బహుమతులీయ గోరుతున్నాడు. ఆనాడు మరియు తూర్పుదేశ జ్ఞానులకు తన్ను అందించినట్లుగా మనమూ అతన్ని తోడి జనానికి అందీయాలని కోరుకొంటున్నాడు — మత్త 2,11. మరి మనం కాదనవచ్చా? పైగా ఆ ప్రభువు అధికంగా యిచ్చినవాళ్ళ వద్దనుండి అధికంగా లెక్క అడగడా? - లూకా 12, 48.

18. ఆత్మ ఫలాలు

1. పిశాచం మనలను నానా శోధనలతో బాధిస్తుంది. ఈ శోధనలనే పౌలు శరీరకార్యాలు అనే పేరుతో గలతీయులు 5, 19-21లో పెద్దజాబితాగా పేర్కొన్నాడు. ఈలాంటి శోధనలనుండి మనలను కాపాడ్డానికీ, భగవంతుణ్ణి మన అనుభవానికి తీసికొని రావడానికీ, ఆత్మ కొన్ని ప్రత్యేక వరప్రసాదాలనిస్తుంది. వీటికే ఆత్మఫలాలు అనిపేరు. వీటిని పౌలు గలతీయులు 5,22లో పేర్కొన్నాడు. ఈ ఫలాలు మొత్తం తొమ్మిది, ఇవి ప్రేమ, సంతోషం, సమాధానం, ఓర్పు, దయ, మంచితనం, విశ్వసనీయత, సాధుశీలత, ఇంద్రియనిగ్రహం.

పూర్వధ్యాయాల్లో చెప్పిన సేవావరాలు క్రైస్తవసమాజ లాభంకోసం ఉద్దేశింప బడినవి. కాని ఈ ఫలాలు వ్యక్తిలాభం కోసం ఉద్దేశింపబడ్డాయి. వీటిద్వారా మన జీవితం భగవదనుభవం తోను భక్తిభావంతోను నిండిపోతుంది.

2. ఇక యీ ఫలాలను వివరంగా పరిశీలించి చూద్దాం.

1) ప్రేమ. క్రీస్తుశిష్యులను ప్రధాన చిహ్నం ప్రేమే. దీని ద్వారానే లోకం మనలను క్రీస్తు అనుచరులనుగా గుర్తించేది - యోహా 13,35. ఈ ప్రేమ దైవప్రేమ, సోదరప్రేమాను.