పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/221

ఈ పుట ఆమోదించబడ్డది

చూపించాడు. ఈలా పాత వస్తువులనూ క్రొత్త వస్తువులను గూడ వెలుపలికి తీసుకొని వచ్చిన యజమానుడు క్రీస్తే. అతడు పూర్వవేదంలోని ప్రాతబోధలతో పాటు తన క్రొత్త బోధలు కూడా విన్పించేవాడు.

ఇంతవరకు ఏ బోధకుడూ క్రీస్తులా మాట్లాడి యెరుగడు - యోహా 7,46. ఆ ప్రభువు శిష్యులై అతని బోధలను ఆలించి పాటించేవాళ్లు ధన్యులు.

8. పందుల ముందు ముత్యాలు - మత్త 7,6

మెస్సియా బోధలు విలువ గలవే. కాని అల్పులు వాటి విలువను గుర్తించలేరు. కనుక శిష్యులు ఎవరికి బడితే వాళ్ళకు మెస్సియా బోధలను విన్పించగూడదు. యోగ్యత లేనివాళ్ళకు ప్రభువు సూక్తులను బోధిస్తే లాభం లేదు. పైగా అవహేళనం పాలౌతాం. పవిత్ర వస్తువులను కుక్కలకు వేయం. వెలగల ముత్యాలను పందుల ముందు పోయం. అలాగే ప్రభువు బోధించే పరమ సత్యాలను కూడాను. అవి యోగ్యులకే గాని అల్పులకు గాదు.

ఒకవైపు మనకు ప్రభుబోధలను ఇతరులకు విన్పించే బాధ్యత వున్నా, అర్హతలేని దుష్టులకు ఆ బోధలు విన్పించగూడదు. అలా చేస్తే ఇతరులకు మేలు చేయడానికి మారుగా మనకు మనమే కీడు తెచ్చిపెట్టుకొంటాం.

7. నాటనాత్మకమైన సామెతలు

పూర్వవేదంలో ప్రవక్తలు నోటితో మాత్రమే గాక, క్రియల ద్వారా గూడ బోధించారు. అనగా తమ బోధలను నటించి చూపించారు - యిర్మీ 19,10-11 అచ.21, 10-11. క్రీస్తు గూడ ఈలా తన బోధలను నటించి చూపించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. వీటికే నటనాత్మకమైన సామెతలు అని పేరు. ఈలాంటి వాటిని కొన్నిటిని ఈ క్రింద సంగ్రహంగా పరిశీలించి చూద్దాం.

1. దేవాలయాన్ని శుద్ధి చేయడం - మత్త 21, 12-13

దేవాలయం ప్రార్థనా స్థానం. కాని యూదులు దాన్ని క్రమేణ వ్యాపార స్థానంగా మార్చారు. కనుక ప్రభువు దేవాలయంలోకి వెళ్ళి కోపావేశంతో అక్కడవున్న బేరగాళ్ళను తరిమివేసాడు. వాళ్ళ అంగళ్ళను కూలద్రోసాడు. ఈలా దేవాలయాన్ని శుద్ధి చేయడం ప్రజలను శుద్ధి చేయడానికి గురుతు. ప్రజల పాపాల వల్ల దేవాలయం అపవిత్రమై పోయింది. ఆ దేవాలయాన్ని శుద్ధి చేయడం ద్వారా సాంకేతికంగా ప్రజలను శుద్ధి