ఈ పుట ఆమోదించబడ్డది

పల్లవ గుహాలయాలలోని దేవతా విగ్రహాలకు తలచుట్టూ ప్రభామండలాలు కానరావు. చాళుక్యుల దేవతా విగ్రహాలకు ఉంటాయి. అవి ఇక్కడ హరిహరనాధునికీ, ద్వారపాలకుల ప్రక్కనున్న అర్ధశిల్ప విగ్రహాలకీ ఉన్నాయి (12, 23, 26,27,28 వ చిత్రపటములు చూడుము). హరిహరనాధుడు చాళుక్య త్రిశూలము పట్టుకొనియున్నాడు. బాదామి హరిహరునివలె గోడ కంటుకు పోయినాడు. నటరాజుకిన్నీ ఎనిమిది చేతులున్నాయి. (12, 23 వ చిత్రపటములు చూడుము). పల్లవ విగ్రహాలకు నాలుగు మించి సామాన్యంగా ఉండవు. నటరాజా వస్త్రానికి చాళుక్య శిల్పంలో లాగా గీరలున్నాయి. ఏడవ గుహ స్తంభాల హారాల అలంకారమూ, గూళ్ళ అజంతా నాతాయనపు పోలికలూ, పరశురాముని పట్టదక్కర్, విరూపాక్ష శివుని జటాభరమూ, ద్వారపాలుర వృష్ఠ స్వస్తికా విన్యాసపు జ్ఞాపకమూ ఈ గుహాలయాల చాళుక్య సాంప్రదాయాల్ని నిరూపిస్తాయి. ఇక్కడి పానవట్టాలు పశ్చిమ చాళుక్య ఆలయాలలో ఉన్నట్లే చతురస్రాలు. వాటి ముక్కులు సన్ననివి. ఈ గుహాలు రాజుల నిర్మాణాలుగా అగుపడక తపస్సుల గౌరవార్ధము శిల్పులు మలచినట్టివై యుంటాయనిపిస్తుంది (వీటి మొత్తపు చేరికలో సౌందర్యము తోపించడము చూస్తే) కనుకనే ఇంత చిన్నవిగా ఉన్నవి. అయితే ఇవి దేవాలయాలు మాత్రమౌను వీటిలోని శిల్పముల ఏర్పాటు చూస్తే ఇవి కట్టుడు అమర్చినారా అనిపిస్తుంది. పల్లవుల ఆలయాల పార్శ్వాలలోనూ, చోళ, చాళుక్య ఆలయాలలోనూ దేవతా విగ్రహాలుంటాయి. బిక్కవోలులోని చాళుక్య ఆలయాని కొకదానికి ఉత్తరాన మహిషమర్దనీ, పశ్చిమాన సూర్యుడూ, దక్షిణాన నటరాజా ఉన్నారు. చోళ ఆలయాలలో అర్ధనారి, బ్రహ్మ, దక్షిణామూర్తీ కలరు. ఇక్కడ పార్శ్వాలలో బ్రహ్మ, విష్ణువులు ద్వారపాలకుల ప్రక్కకి వచ్చారు. వేరు గూళ్ళలో ఉన్నారు.

భైరవకోన శిల్పసంపద

భైరవుడు:

భైరవకోనయందు హరిహర నటరాజులున్న బండమీదనే భైరవుణ్ణి నిలిపియున్నారు (12, 32వ చిత్ర పటములు చూడుము). ఇచటి భైరవ శిల్పము ఎక్కువ ప్రాచీనమైనదికాదు. విజయనగర కాలము నాటిది. భైరవుని చుట్టూ నిర్మింపబడిన ఆలయము ప్రాగుటూరు ప్రాంతపు 'ఝూర్జర', 'ప్రతీహారుల' ఆలయాలు పోలికతో వున్నది ఈ భైరవుణ్ణిబట్టి ఈ కొండనూ, కోననూ భైరవుని పేరుమీదనే వ్యవహరిస్తున్నారు. శివుడు భైరవస్వామి రూపమున సర్వసాధారణముగా ఉగ్ర లేక ఘోర రూపమును కలిగియుండును. కానీ ఈ రూపపు శివుని ఘనతలకు చెందిన ఎట్టి కథలు ఉండవు. విరూపాక్ష, వీరభద్ర, ఆఘోర, రుద్రపాశుపతి మొదలగునవికూడా ఈ తెగకు చెందినవే. ఆగమములు 64 భైరవులగూర్చి తెలుపుచున్నవి. వీరు ఎనమండ్రు లెక్కన ఎనమండ్రు కూటములుగా విభజింపబడిరి. ఒక్కొక్క కూటమి నాయకులు వరుసగా అసితంగ, రుద్రచండ, క్రీధ. ఉన్మత్తభైరవ, కపాల, భిషాణ, సంహారలు: ఉత్తర, దక్షిణ భారతదేశమున సాధారణముగా బటుక (వటుక) భైరవ లేక యునభైరవుడు. రూపమందవ గ్రంథము వటుక భైరవుడు ఎనిమిది చేతులను కలిగియుండును. ఒక చేయి అభయ హస్తముగను,మిగిలినవి ఖట్వంగ, పాశ, శూల, డమరు, కపాల, సర్పము, మాంసపు ముక్కలను కలిగియుండునని తెలుపుచున్నది (కట్వంగం మాంసపాశం చశూలంచతథతం కరౌ/డమరు చ కపాలం చ వరదం భుజంగం తథ). భైరవునికి ఒకవైపున శునకము వుండవలెను. వటుక భైరవకల్ప గ్రంథమున భైరవుడు త్రినేత్రములను, ఎర్రటి