పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/59

ఈ పుట ఆమోదించబడ్డది

46

అక్కన్న మాదన్నల చరిత్ర

దకు శివాజికి ముందుభోజన మిడుదుమనిరి. ఆతఁడు వారు ముందుభుజించినగాని తానుభుజింపనని పట్టుపట్టగా విధిలేక తా మెల్లరును శివాజి క్షమను నూర్లపర్యాయము ప్రార్థించి భుజించిరి. తర్వాత శివాజిని కూర్చుండ నియోగించి చెంతకూర్చుండి భానూజి మహారాష్ట్రభాషలో మాటలాడుచుండఁగా భాగ్యమ్మ స్వయముగా పరిచారకులు తెచ్చియిచ్చిన పళ్లెముల నందుకొని వడ్డించెను. అక్కన్నమాదన్నలు తండ్రియెదుట కూర్చుండు వారుకారు; దూరమునుండి వచ్చుచు పోవుచు, నడుమనడుమ తమకుతోఁచిన పండో, లేహ్యమో, మురబ్బాయో తెచ్చి పెట్టుచుండిరి. విశ్వనాథ మృత్యుంజయులు మహారాష్ట్రుల బలగమునంతయు పరికించుచుండిరి.

శివాజి ఈమర్యాదకు పరమానందభరితుఁ డాయెను. భోజనానంతరము తాంబూల చర్వణమైనవెనుక శివాజి ఎల్లవారికిని రత్నాదికములు భూషలు నిచ్పి బయలుదేరెను. అక్కన్న మాదన్నలు తండ్రిచేత శివాజికి వస్త్రములు ఏనుఁగులు గుఱ్ఱములు మొదలైనవాని నిప్పించిరి. శివాజి ఆ వృద్ధ దంపతులకు సాష్టాంగముగా నమస్కరించి వీడ్కొనెను. అతని యనుచరులును ఆ పార్వతీపరమేశ్వరులకు అట్లేచేసి బయలుదేరిరి. మాదన్న మరల మహారాష్ట్రపతిని మర్యాదగా బసలో విడిచివచ్చెను.

ఇంతవరకు శివాజీ మాదన్నలు వ్యవహారవిషయములు మాటలాడలేదు. అబుల్‌‌హసౝ తానాషాకు శివాజియందు