ఈ పుట ఆమోదించబడ్డది

డొకవృద్ధస్త్రీ ఖిన్నవదనయై యాతనిజూడ గాచియుండెను. అతడు తనకు స్వాభావికమగు నాదరముతో నామెను దగ్గర జేరి వృత్తాంతంబడిగెను. ఆయమ "అయ్యా! నావిభుడును, ముగ్గురు కుమారులును సైనికులైరి. గడచిన యుడ్ఢమున నా మగడు పరలోకగతుడాయెను. అప్పటినుండి యేకాకినై బహుదు:ఖముల జెంది కష్టజీవి నై యున్నదానను. నాపెద్ద కుమారు నాకప్పగింప వేడుదమని వచ్చితి న"నెను. ఆమె ముఖమువైపు కొంతకాలము చూచి, మిక్కిలి మృదుపదంబుల "తల్లీ! నీవు మా కెల్లరనిచ్చి, నీయేడుగడ గోలుపోయితివి. కావున నీపుత్రులనొక్కని నీ కిచ్చుట ధర్మమే" యని చెప్పుచు, వెంటనే యుత్తరువు వ్రాసియిచ్చెను.

ఆ యుత్తరువుం గొని యామె స్వయముగ సేనవిడిదికి గుమారు గొనిరా వెడలెను. అయిన నతడు యుద్ధమున జావుదెబ్బదిని వైద్యశాలకు దీసికొనపోబడి యుండెను. ఈ సమాచారమువిని యా మాత మిక్కిలి తత్తరమున నచటికి బోయెను. ఆమె పుత్రుని గండ్ల జూడకమున్నె యతడు ప్రాణములు విడిచెను. పట్టరాని శోకము నట్టె యణచుకొని యక్కడి వైద్యుడు వ్రాసియిచ్చిన పత్రముంగొని యామె మరల లింకనును జూడ వేచియుండెను. నాడును నే నచటికి గార్యార్థి నై వెడలి యుంటిని. ఆమె