ఈ పుటను అచ్చుదిద్దలేదు

టంగుటూరి ప్రకాశం

కాంగ్రెస్, ఒంగోలు (జనరలు) నియోజకవర్గం, జననం:- 23-8-1872 విద్య, బి.ఏ.బి.యల్. బ్యార్ ఎట్ లా, 1891 రాజమండ్రి మునిసిపల్ చైర్మన్, 1907 సూరత్ కాంగ్రెస్ డెలిగేటు గాంధీజీతో పరిచయం, 1919 మహానందిలో జరిగిన ఆంధ్రరాష్ట్రీయ కాంగ్రెస్ అధ్యక్షత, 1921 వకాల్తా జీవితం స్వస్తి. నవంబరులో ' స్వరాజ్యపత్రిక ' స్థాపన, 1926 కేంద్ర శాసనసభసభ్యుడు, 1928 మద్రాసు హైకోర్టు ఎదుట సైమన్ కమిషన్ బహిష్కరణ, 1931 మద్రాసులో "ఉదయవనం" లోను స్వగ్రామమైన "దేవరంపాడు" లోను ఉప్పు సత్యాగ్రహంచేసి, గుంటూరులో అరెస్టు, గుంటూరు ఆంధ్ర రాజకీయ మహాసభ అధ్యక్షత, 1937 రాజాజీ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రి, జమీందారీ విచారణకమిటీ అధ్యక్షత, 1940 మంత్రిపదవికి రాజీ. 17-10-40 వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు, 1942 ఆగస్టు ఉద్యమములో బొంబాయి ఏ. ఐ. సి. సి. నుండి వస్తూ కడపలో అరెస్టు,1-5-1946 మద్రాసు ప్రధాని పదవి, 1947 రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యుడు, 1950 కాంగ్రెస్ నుండి రంగా గారితొ విడిపోయి ప్రజాపార్టీ స్థాపన, 1952 "శృంగవరపు కోట నియోజకవర్గం నుండి ప్రజా సోషలిస్టు పార్టీ తరపున మద్రాసు శాసనసభకు ఎన్నిక, ఏప్రియల్ లో డెమాక్రాటిక్ ఫ్రంట్ నాయకునిగా ఎన్నిక, 1952 "ప్రజాపత్రిక" ఇంగ్లీషు వారపత్రిక ప్రారంభం, మద్రాసులో జరిగిన ఆంధ్ర కాన్ఫరెన్సు అధ్యక్షత, 1953 1 అక్టోబరున ఆంధ్రరాష్ట్ర స్థాపన, జరిగిన తరువాత ప్రథమ ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిపదవి, అనేక సంవత్సరాలు ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షత, ఏ. ఐ. సి. సి. సభ్యుడు, ప్రత్యేక అభిమానం:- ఆంధ్రప్రజలు, ప్రకృతివైద్యం, అడ్రస్సు:- ఒంగోలు, గుంటూరుజిల్లా.


గింజుపల్లి బాపయ్య