పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/93

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కుందుర్తి వేంకటాచలకవి.

ఈకవి మిత్రవిందాపరిణయ మనెడి యారాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇత డాఱువేల నియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; శాండిల్య గోత్రుడు; రామయామాత్య పుత్రుడు. ఈతని తాతయైన గోవిందామాత్యుడు 1650 వ సంవత్సర ప్రాంతములయందు రాజ్యముచేసిన వీరవేంకటపతి రాయలవద్ద నుండు, భారతీ పరిణయమను కావ్యమునుజేసి యాతనిని మెప్పించినట్లు కవి యీక్రింది పద్యమున జెప్పియున్నాడు -