పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/84

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మంగళగిరి ఆనందకవి.

ఈకవి వేదాంతరసాయన మనెడు నాలుగాశ్వాసముల పద్యకావ్యమును రచియించి దానిని నిడిమామిళ్ళ దాసయామాత్యుని కంకితము చేసెను. కవిక్రైస్తవమత మవలంబించిన నియోగిబ్రాహ్మణుడు. ఈతడు తిమ్మయామాత్యుని పుత్రుడు; ఆత్రేయ గోత్రుడు; కవి కృతిపతి తన్నుగూర్చి పలికినవిధము నిట్లు చెప్పుకొన్నాడు -