28
ఉమర్ ఖయ్యామ్
107
ఆనందప్రతిబింబమే కలదు నీ యాత్మన్, భవత్మాణిలోఁ
బానార్హంబగు శీధుపాత్ర గల దాపాత్రన్ విసర్జింప కో
జ్ఞానీ ! నీ కిల దీనికన్న నిఁక విశ్వాసార్హుఁడౌ మిత్రుఁడున్
లేనేలేఁడు సుమా యథార్థమిది వేలీలన్ వితర్కించినన్.
108
చెలి యిలఁ జిల్కరించు ప్రతి శీధుకణంబు హృదంతదుఃఖ కీ
లలఁ బరిమార్చుచుండె నహ ! లాతిజనం బిది వట్టినీళ్ళుగాఁ
దలఁచు నపోహలం దవిలి దారుణ ఘోర హృదంతరాళ చిం
తలఁ దొలఁగించుచున్న దిది తథ్యము గాలికబుర్లి కేటికిన్.
109
వృథగా దుఃఖముఁ జెందనేల విధి యీవిశ్వంబులో నెందఱన్
బృథివిన్ గూలిచి మన్ను చేసినదియో విశ్వజ్ఞ ! లే వేగమే
మధుపాత్రన్ గొని నా కరాన నిడుమా మద్యంబునే త్రావెదన్
విధి యేరీతిన్ నున్న నాగతియగున్ వేయేండ్లు చింతించినన్.
110
మద్యపానాప్తి ధనికులే మాయుచుంద్రు
వీరియార్భాటమునఁ బ్రజ విసుగు ; దాని
విడిచి, దుఃఖాహిగ్రుడ్డిదై వెడల హుక్క,
వజ్ర పేటికలోఁ బచ్చవాడుచుంటి.