పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/159

ఈ పుటను అచ్చుదిద్దలేదు
150

కాళిదాస చరిత్ర

రో క లి

ఒక నాడు

నిశాసమయమున

భోజమహారాజు పురజనుల కష్టనిష్టురములు నెఱుంగుటకై ప్రచ్చన్నుడై సంచరించుచుండ నెలజవ్వని యొకర్తు తనహస్తపల్లనమున రోకలి బట్టుకొని ధాన్యము దంచుచుండెను. ఆమె మిక్కిలి చక్కనిది. నెలజవ్వనంబున వెలయుచుండెను. ఆమె సౌందర్యమును, లావణ్యమును, తారుణ్యమును, వీక్షించి తన మనంబున రోకలినుద్దేసించి "ఓరోకలీ ! చిగురువంటి యామెచేతి సంపర్కముచేతనైన నీవు చిగురింపలేవుగదా? నీవువట్టికొయ్యవే" యని యర్దమువచునట్టి యీ క్రింది సంస్కృత పదముల ననుకొనెను:

"ముసల కివలయంతే తక్షణాధ్యన్నజాతయ్

    అని తలంచి దానినే యొక శ్లొకముయొక్క కడపటిపాదముగా గూర్చి యాసమస్యను బూరింపుమని కాళిదాసుకిచ్చెను. ఆకవిసార్వభౌముడు తక్కిన మూడుచరణముల నిట్లు పూరించెను:

      శ్లో॥జగతి విదితి మేతత్, కాష్టమే వాసి మానం:
           తదపిచ కిల సత్యం, కాననే నర్దితో సి
           నవకువలయనేత్రాపాణిసంగొత్సమే స్మిన్
           ముసల ? కిసలయంతే తక్షణా ద్యన్నజాతం

           తా॥ ఓరోకలీ! క్రొత్తకలువలవంటి కన్నులుగల యకళ్యాణి హస్తస్పర్శమహోత్సవము చేతగూడ నీవు చిగురింపనికారణమున నీనడవిలో గొంతకాలము వృద్ధిపొందినప్పటికి నీవు వట్టి కొయ్యవే!
    ఆశ్లోకసారస్యముగ్రహించి రసికాగ్రేసుడైన భోజభూపతి కాళిదాసునకు గొప్ప పారితోషిక మిచ్చెను.