ము - "విదేశి.”
మే - అంతబాగుండలేదు. “పరదేశి” అంటే దానికంటె సరిగ్గా ఉంటుంది. అనగా వెనకాలకూర్చున్న మోహనరావు అడగందే.
మో - మేష్టారండి! మీరు చెప్పిందానికంటె మరొకటి మరీ జోరుగా ఉంటుందండి,
మే - ఏమిటి?
మో - “బహిర్దేశి”
169
ఒకతురక రైల్లో పోతూ, తనపక్కకూచున్నది ఒక బ్రాహ్మడని కనిపెట్టి.
తు - బొమ్మన్ జీ! హిందూస్తానీకా మాలుమ్?
అని అడగగా, బ్రాహ్మడు ప్రత్యుత్తరం చెప్పక, తెలిసినట్టు తలకాయి ఊపగా,
తు - కహోజాతే?
బ్రా - అబ్బో! ప్రజ్ఞ! మాలోనూ ఉంది, ఉత్తమే శిఖరేజాతే!
170
వెంకాజీ - వర్దనమ్మాగారూ! అయిందీ, మీ మనమరాలి వివాహం?
వ - ఏదో అషిషూ అయింది, నాయన! కన్నెచెర వొదిలింది.
వెం - సంతోషం. కట్నం ఏమాత్రం, లాంచనాలేమిటి?
వ - కట్టం లేదుగాని, పెళ్ళికొడుకు పెంకితనం చేస్తే, తరవాత, చేతికి కట్టుగోడానికిష ఓవిష్ణువాచీ కొని ఇస్తాం అన్నాం.
171
శివయ్య - బాపిరాజూ! మనఊరి డిస్ట్రక్టుమునసబుగారు ఏం ప్యాసయ్యాడురా పరిక్షలూ! ఆయనికి అన్నీ డిగ్రీలే. వాటికి లెక్కాపత్రం లేదు.
బా - ఇవేంచూశావు ? వీళ్ళ అన్నది సామ్మూ!
శి - ఆయన కెన్ని ఉన్నాయి?
బా - మూడువందల అరవై సరిగ్గా,
172
కోదండం - బలరామా! విన్నావా? చలమప్పసెట్టి ఇనసాలమెంటు ఎక్కాడట! పెళ్ళాం లేవడం లేదుట!
బ - పాపం! విచారం గావును.
కో - కాదుట! నగలు మొయ్యలేక.
173
కొత్తగా గర్భాధానం అయిన సింహేశ్వరరావు తమయింటిహాలులో కూర్చుని ఉండగా, అతని స్నేహితుడు కమలయ్య దవడ చేత్తో పట్టుగుని ప్రవేశించగా,
సిం - అదేమిటోయ్?
క - (మూలుగుతూ) పల్లుతీపూ! ఇది ఎల్లాపోవడం?
సిం - ఒస్! ఇంతేగద! నేనోటి చెప్తాను గప్చిప్గా చేసిపారెయ్!
నేనూ ఇల్లానే ఈ మధ్య బాధపడ్డాను. కాని, నా పెళ్ళాన్ని ముద్దుప్పెట్టుగునేసరికి బాధ ఎక్కడి దక్కడ ఎగిరి చక్కాపోయింది.
భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1
37
హాస్యవల్లరి