సప్తమాశ్వాసము 103
జూచి నీవు ద్వైతవనంబునకుఁ బోయి పాండవుల కర్జునుకుశలవార్తయుఁ బాశుపతాస్త్రలాభంబును స్వర్గగమనంబుం జెప్పు మని పల్కి యింద్రుండు నిజస్థానంబున కరిగె. 107
ఆ. విశ్రమించె నొక్కవృక్షంబుక్రీనీడ, నర్జునుండు మణిశిలాంతరమున
ఖండపరశుబాహుదండనిష్పీడన, ముష్టిఘాతఖేదమోక్షమునకు. 108
శా. మౌళిం గోహళి సంఘటించినక్రియ న్మధ్యాహ్నవేళ న్మహా
కాళం బైననభోవిభాగమున వీఁకం గాసె బీరెండయా
ప్రాలేయాహితసంప్రదీప్తకిరణప్రక్రీడదర్కోపల
జ్వాలాజాలజటాలజాంగలతటీవాచాలకోయష్టి యై. 109
వ. అప్పుడు మధ్యాహ్నకాలపూజకు నాయితంబై. 110
సీ. పావననిర్ఝరాంభఃప్రవాహంబున నఘమర్షణస్నాన మాచరించి
కసటువోఁ దెలినీటఁ గడిగి యీటార్చిన సలిలకాషాయవల్కలము గట్టి
యాపాదమస్తకం బఖిలాంగకంబులఁ గమ్మనిభసితంబు గలయ నలఁది
వెడఁదముత్యములతో నెడవెట్టి గ్రుచ్చిన మంచిరుద్రాక్షదామములు దాల్చి
తే. పులికళాసంబుగద్దెపైఁబూన్కి మెఱయఁ, బంచశుద్దులు గావించి పాండుసుతుఁడు షోడశోపచారంబులు పొందిఁ దీర్చె, నీలగళునకు మధ్యాహ్నకాలవేళ. 111
వ. ఇట్లు శివలింగార్చనంబు దీర్చి కందమూలఫలోపహారంబులు సమర్పించి తత్ప్రసాదంబునఁ దానును దేహయాత్ర నడపి విశ్రాంతుండై యున్న సమయంబున ధవళహయసహస్రంబులఁ బూన్చినరధంబు గొని వచ్చి మాతలి తనకుం బొడసూపిన సబహుమానంబుగా నాదరించి పురందరాదేశంబున నద్దివ్యస్యందనం బెక్కి యాకాశమార్గంబునం జనునప్పుడు. 112
సీ. ఇది మేఘమండలం బివి విమానంబులు యక్షవిద్యాధరోపాశ్రయంబు
లిది యాహవస్కంధ మదె తారకావీథి యల్ల తెల్లనిరేఖ యభ్రగంగ
యల్లదె శింశుమారాకారహరిమూర్తి వీఁడె భాస్వంతుఁడు వాఁడె ధ్రువుఁడు
వీరె సప్తర్షులు వారె యశ్విన్యాదు లిరువాడ దేవేరు లిందు భార్య
తే. లల్లవాఁడె సుధాకరుం డవె గ్రహంబు, లిల్వలాఖ్యంబు లగుచుక్క లివె కెలఁకుల
ననుచు మతలి చూపంగ నర్జునుండు, కౌతుకం బంది గగనమార్గంబునందు. 113
శా. జంభారాతితనూజుమీఁదఁ బొలిచెన్ సావిత్రివర్త్మంబున
న్సంభిన్నోదరశాతకుంభనలినీనాలీకసంవాసనా